రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కలరా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని UNO హెచ్చరించింది.
సుమారు 100 కోట్ల మంది కలరా బారినపడే ప్రమాదం ఉందని UNO తాజా నివేదికలో పేర్కొంది. ప్రధానంగా 40 దేశాలకు చెందిన చిన్నారులు ఈ జాబితాలో ఉన్నారని తెలిపింది.
ఇప్పటికే 24 దేశాల్లో కేసులు నమోదైనట్లు వెల్లడించింది. వాతావరణ మార్పులు, పారిశుద్ధ్య నిర్వహణ లోపం, నీటి శుద్ధిపై దృష్టి పెట్టకపోవడమే దీనికి కారణమని తెలిపింది.