తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు బడి విద్యార్థులకు ఐర న్, సూక్ష్మపోషకాలతో కూడిన పోషకాహారాన్ని అం దజేయడంలో భాగంగా రాగిజావను బ్రేక్‌ఫాస్ట్‌గా అందజేయ నున్నారు.
రాష్ట్రంలోని 16.82 లక్షల మంది విద్యా ర్థులకు ఏడాదిలో 110 రోజులపాటు వారంలో 3 రోజులు రాగిజావను పంపిణీ చేస్తారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా దీనిని అందజేయనుండగా, ఇందుకు 2023-24 విద్యాసంవత్సరానికి పీఎం పోషణ్ అభియాన్ ప్రాజెక్ట్ ఆమోదిత మండలి (పీఏబీ) ఆమోదం తెలిపింది.
శుక్రవారం కేంద్ర విద్యాశాఖ పీఏబీ మినిట్స్‌ను విడుదల చేసింది. పథకం కోసం మొత్తం రూ.27.76 కోట్లను వెచ్చించనుండగా, కేంద్రం రూ.16.18 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.11. 58 కోట్లను వెచ్చించనున్నాయి.