ఈ ఐపీల్ సీజన్ లో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ సత్తా చాటింది. పంజాబైపై 4వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జైశ్వాల్ 50, పడిక్కల్ 51, హెట్మేయర్ 46, పరాగ్ 20 పరుగులతో రాణించడంతో రాజస్థాన్ విజయం సాధించింది.
పంజాబ్ బౌలర్లలో రబాడా 2, అర్షదీప్, చాహార్, ఎల్లీస్, కరన్ తలో వికెట్ తీశారు. పంజాబ్ ఓటమితో ప్లేఆఫ్స్ కు వెళ్లకుండా వెనుదిరిగింది. అయితే మిగతా జట్ల ప్రదర్శనపై రాజస్థాన్ అదృష్టం ఆధారపడనుంది.