తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయంలో తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో మంత్రులతోపాటు అధికారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలపై చర్చించడంతోపాటు పలు కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోనున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.
జూన్ 2 నుంచి 21 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రాభివృద్ధి తీరుతెన్నును ప్రజలకు కళ్లకు కట్టేలా వివరించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు.