తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం చెనుగొనిపల్లి గ్రామంలో హలీం పాషా ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుకు మనిషి రూపాలతో ఉన్న ఈ వింత పురుగు కనిపించడం జరిగింది.
ఆశ్చర్యంగా కనిపిస్తున్న ఈ వింత పురుగుకి కళ్ళు, ముక్కు, నోరు, తల మొత్తంగా చెప్పాలంటే తలభాగం మనిషికి ఉండే విధంగా కనిపించడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఇలాంటి సంఘటననే సుమారు 15 సంవత్సరాల కిందట గద్వాల పట్టణంలో కూడా ఇలాగే ఒక వింత పురుగు మనిషి ఆకారంలో ఉన్న పురుగు కనిపించింది. గద్వాల పట్టణంలోని శేర్లి వీధికి చెందిన ఒక వ్యక్తి తెల్లవారుజామున టీ తాగేందుకు బయటకు వస్తున్న సందర్భంలో ఆ వింత పురుగు ఈయనకు కనిపించినట్లు అప్పుడు కూడా అందరూ ఆశ్చర్యానికి గురైన విషయం తెలిసిందే. మొత్తంగా చెప్పాలంటే మనిషి ఆకారంలో ఉన్న వింత పురుగును చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.