కర్ణాటకలో కాంగ్రెస్ సంబరాల్లో ఉండగా ఆ పార్టీ ముఖ్య నేత.. మాజీ సీఎం సిద్ధరామయ్య ఇంట్లో మాత్రం విషాదం నెలకొంది. ఆయన సోదరి శివమ్మ భర్త రామేగౌడ (69) కన్నుమూశారు.
ఈరోజు శనివారం ఉదయం అస్వస్థతకు గురైన రామేను మైసూరు ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటి క్రితం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో మాజీ ముఖ్య మంత్రి ఊరిలో విషాద ఛాయలు అలముకున్నాయి.