కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అయిన బీజేపీ ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీ మాత్రం ఒక విషయంలో సంతోషంగా ఉంది.
సెంటిమెంట్ ప్రకారం కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఓడిపోతే కేంద్రంలో అధికారంలోకి వస్తామని చెబుతోంది. 2013లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 40, కాంగ్రెస్ కు 122 సీట్లు వచ్చాయి..
అయితే ఆ తర్వాత 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. 2018లోనూ రాష్ట్రంలో తొలుత కాంగ్రెస్ అధికారం చేపట్టగా, 2019లో రెండో సారి మోదీ పీఎం అయ్యారు. ఇప్పుడూ అదే రిపీట్ అవుతుందని బీజేపీ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.