ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు షాకిచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరుకు రోడ్లలో సభలు, రోడ్ షోలను నియంత్రించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్-1 ను హైకోర్టు కొట్టేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని అభిప్రాయపడింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే జీవో ఇచ్చారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు.