ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ట్విటర్ కు కొత్త సీఈవోను నియమించినట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆమె 6 వారాల్లో విధుల్లో చేరుతారని తెలిపారు.
అయితే ఆమె పేరు వెల్లడించలేదు. తాను కార్యనిర్వాహక చీఫ్గా కొనసాగుతానని తెలిపారు. ఉత్పత్తి, సాఫ్ట్వేర్ ను పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు. కాగా, ట్విటర్ ను 44 బిలియన్లకు కొనుగోలు చేసిన తర్వాత అప్పటి సీఈవో అనురాగ్ పరాగ్ను మస్క్ తొలగించారు. అప్పటి నుంచి తానే ఆ పదవిలో కొనసాగుతున్నారు.