తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పది ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, ఎస్సెస్సీ బోర్డు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
86.60 శాతం ఉత్తీర్ణత…
బాలికలు 88.53 శాతం…
బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత…
2793 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత…
25 స్కూళ్లలో సున్నా శాతం ఫలితాలు…
99 శాతంతో ప్రథమ స్థానంలో నిర్మల్…
59.46 శాతంతో చివరి స్థానంలో వికారాబాద్…