తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ లో క్షత్రియ సేవా సమితి తెలంగాణ & ఆంధ్ర ప్రదేశ్ ల ఆధ్వర్యంలో మన్యం వీరుడు, భారత స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు గారి 99వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ట్యాంక్ బండ్ పై ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి అన్ని పురస్కరించుకొని రూపొందించిన ఆడియో గీతాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు గారి చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. వారి జయంతి , వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున నిర్వహిస్తామన్నారు. వారి 125వ జయంతిని హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఘనంగా ప్రారంభించామన్నారు. హైదరాబాద్ నగరంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి ఏర్పాటుకు సంబంధించి స్థలాన్ని కేటాయించమన్నారు. రాష్ట్రాలు వేరైనా ప్రజల మధ్య స్నేహపూర్వక సత్సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, క్షత్రియ సేవా సమితి తెలంగాణ & ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షులు నాగరాజు, ఉపాధ్యక్షులు రఘురామరాజు, సెక్రటరీ ప్రదీప్ వర్మ ,జాయింట్ సెక్రెటరీ నాని రాజు, ఇండస్ట్రీయలిస్ట్ మైనర్ రాజు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్యామల రాజు తదితరులు పాల్గొన్నారు.