ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ తమ యూజర్ల కోసం సరికొత్త పీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.ఈ పీచర్ లో భాగంగా వాట్సాప్ లో సింగిల్ ఓట్ పోల్స్, సెర్చ్ ఫర్ పోల్స్ ఇన్ యువర్ చాట్స్, స్టే అప్‌డేటెడ్ ఆన్ పోల్ రిజల్ట్స్ అనే మూడు ఆప్షన్లను తీసుకువస్తున్నట్టు తెలిపింది.
క్రియేట్ సింగిల్ ఓట్ పోల్స్ ఆప్షన్ ద్వారా పోల్స్‌లో ఒక్కరు ఒకేసారి ఓటు వేసే అవకాశం ఉంటుంది.సెర్చ్ ఫర్ పోల్స్ ఇన్ యువర్ ఛాట్స్ ఆప్షన్ ద్వారా వినియోగదారులు ఫోటోలు, వీడియోలను సెర్చ్ చేసినట్టే పోల్స్ కోసం కూడా చాట్స్ స్క్రీన్‌లోకి వెళ్లి సెర్చ్ చేయవచ్చు.
స్టే అప్‌డేటెడ్ ఆన్ పోల్ రిజల్ట్స్ ఆప్షన్ ద్వారా పోల్‌లో ఎంతమంది పాల్గొన్నారు, ఫలితాల అప్‌డేట్‌లను నోటిఫికేషన్ల రూపంలో పొందవచ్చు.