తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ఐకాన్ హీరో అల్లు అర్జున్ హీరోగా… నేషనల్ క్రష రష్మికా మందాన హీరోయిన్ గా.. సునీల్ ,రావు రమేష్,అనసూయ ప్రధాన పాత్రలుగా నటించగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చి వరల్డ్ వైడ్ గా ఘన విజయం సాధించిన మూవీ పుష్ప .
ఈ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఎదురుచేస్తున్నారు. త్వరలో థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది.
ప్రస్తుతం మూవీ ఆడియో రైట్స్ కోసం పలు సంస్థలు పోటీపడ్డాయట. చివరికి T సిరీస్ రూ.65కోట్లకు దక్కించుకుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మ్యూజిక్ రైట్సేకే ఇంతొస్తే.. మూవీ ఎన్ని రూ. కోట్లు రాబడుతోందని ఫ్యాన్స్ లెక్కలు వేస్తున్నారు.