తెలంగాణలో ఇకపై రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లకుండానే ఆర్ట్స్ గ్రూప్‌లో ఇంటర్మీడియట్ చదవాలనుకునేవారికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అద్భుత అవకాశం కల్పించింది.
ఆయా అభ్యర్థులు హాజరు నుంచి మినహాయింపు పొందడానికి రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.ఆ తరువాత పరీక్ష ఫీజు చెల్లించి ఇంటర్ పరీక్షలు రాయొచ్చని బోర్డు అధికారులు తెలిపారు.
ఇలాంటి విద్యార్థులు ఈ నెల 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల కోసం tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని లేదా 040-24600110 నంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించాలని ఇంటర్ పరీక్షల నియంత్రణాధికారి జయప్రదాబాయి సూచించారు.