తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం కోసం ఈ నెల నుంచే సన్నబియ్యంతో భోజనం అందించనున్నారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి గంగుల ఫైల్ పై సంతకం చేసిన విషయం తెలిసిందే.
దీంతో ప్రతి నెల 35,700 అంగన్వాడీ కేంద్రాలకు 2121 టన్నుల సన్న బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. 5.25లక్షల మంది చిన్నారులకు, 3.75లక్షల మంది గర్భిణులు, బాలింతలకు చేకూరనుంది.