కార్మిక దినోత్సవాన్ని (మేడే) పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు పారిశుద్ధ్య కార్మికులకు వేతనంలో అదనంగా వెయ్యి రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల గ్రేటర్ వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి హర్షం వ్యక్తం చేస్తూ కార్మికుల పక్షాన, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ తరఫున మంగళవారం రోజున నూతన సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
జారీ చేసిన వేతన పెంపు ఉత్తర్వుల వల్ల వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలోని సుమారు 3000 మంది పారిశుద్ధ్య కార్మికులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు కార్మికుల పక్షపాతిగా ఉంటూ రెండుసార్లు జీతభత్యాలు పెంచారన్నారు.
శ్రీ కెసిఆర్ గారు కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్లుతూ ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం అమలు చేస్తున్నారన్నారు. శ్రీ కెసిఆర్ గారికి కార్మికులంటే ఎనలేని గౌరవమని, కరోనా కష్టకాల సమయంలో కూడా పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెల కట్టలేమని, వారికి ప్రత్యేకంగా ఇన్సెంటివ్స్ అందజేయడం జరిగిందన్నారు. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెంచడంపై మరోసారి సీఎం శ్రీ కేసీఆర్ గారికి శిరస్సు వంచి మేయర్ సుధారాణి ధన్యవాదాలు తెలిపారు, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేసిన వారిలో బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు గుండు విజయరాజ్ ఉన్నారు.