1886లో షికాగోలోని హే మార్కెట్‌లో జరిగిన కార్మికుల ప్రదర్శన మూలంగా ఆవిర్భవించిన మే డే శుభాకాంక్షలను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కార్మికులకు తెలిపారు. కార్మికులపై భారం మోపేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు అన్నారు.
సత్తుపల్లి పట్నంలో తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఎమ్మెల్యే సండ్ర పాల్గొన్నారు. కేసీఆర్ గారు రాష్ట్ర ఆదాయం పెంచి.. పేదలకు పంచాలన్న ఆలోచనతో పనిచేస్తున్నారన్నారు.
కేసీఆర్ పెరిగిన ఆదాయాన్ని ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల రూపంలో ఖర్చు చేస్తుంటే.. కేంద్రం మాత్రం పేదల పొట్ట కొడుతుందని అన్నారు. ప్రైవేటీకరణతో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు బడుగు, బలహీన వర్గాలకు అందకుండా పోతున్నాయని ఎమ్మెల్యే సండ్ర వ్యక్తంచేశారు.