నిన్న ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై సెంచరీ(124) చేసిన యశస్వి జైశ్వాల్ అరుదైన రికార్డు సాధించారు. జాతీయ జట్టుకు ఆడకుండా ఐపీఎల్ లో అత్యధిక స్కోరు సాధించిన క్రికెటర్ గా నిలిచారు.
2011లో పాల్ వాల్తాటి(పంజాబ్) చెన్నైపై 120* రన్స్, 2009లో మనీష్ పాండే(ఆర్సీబీ) డెక్కన్ ఛార్జర్స్ పై 114* రన్స్ చేశారు. అలాగే మనీష్ పాండే(19Y, 253D), పంత్ (20Y, 218D), పడిక్కల్(20Y, 289D) తర్వాత తక్కువ ఏజ్‌లో(21Y,123D) సెంచరీ చేసిన ప్లేయర్ గా యశస్వి నిలిచారు.