తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కళాసిగూడలో మ్యాన్ హోల్లో పడి చిన్నారి మౌనిక మరణించిన ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి స్పందించారు.
పెద్ద వర్షం వల్ల అక్కడ రోడ్డు కుంగిపోయి ఆ గోతిలో పడి మౌనిక మృతి చెందినట్లు చెప్పారు. కుంగిన చోట ఉంచిన బారికేడ్లను కొందరు తొలగించడం వల్ల ప్రమాదం జరిగిందన్నారు.
అధికారుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. నాలాలో పడి ఆమె చనిపోలేదన్నారు. మౌనిక కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.