ఐర్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్సింగ్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించి.. 2 టెస్టుల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. లంకకు ఇది టెస్టుల్లో 100వ విజయం. 311 టెస్టుల్లో ఈ ఘనతను అందుకుంది.
ఆసియా దేశాల్లో లంక కంటే ముందు భారత్(569 టెస్టుల్లో 172 విజయాలు), పాక్ (451 టెస్టుల్లో 146 విజయాలు) ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక విజయాల జాబితాలో ఆస్ట్రేలియా(853 టెస్టుల్లో 405 విజయాలు) తొలి స్థానంలో ఉంది.