తెలుగు సినిమా పరిశ్రమలో సెంటిమెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువమంది అది ఫాలో అవుతూ వుంటారు, కొందరు అది ఫాలో ఎవరు. ఒక నటీమణి వరసగా హిట్స్ ఇస్తుంటే ఆమెనే తమ సినిమాలో పెట్టుకోవడానికి ఇష్టపడతారు. సాయి ధరమ్ తేజ్ , సంయుక్త మీనన్ నటించిన ‘విరూపాక్ష’ సినిమా పెద్ద విజయం సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇందులో నటించిన నటి సంయుక్త కి ఇది వరసగా నాలుగో హిట్ సినిమా.
ఇంతకు ముందు ఆమె ‘భీమ్లా నాయక్’ , ‘బింబిసార’ , ‘సర్’ ఇప్పుడు ఈ ‘విరూపాక్ష’ సినిమాతో ఆమె వరుసగా విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. అయితే ఇవన్నీ ఆమె తెలుగు పరిశ్రమకి వచ్చినప్పుడు వొప్పుకున్నవే అని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఇప్పుడు తదుపరి సినిమాలకి ఆమె పారితోషికం పెంచుతోందని వినికిడి.
ఇప్పుడు సంయుక్త మీనన్ కూడా వన్ క్రోర్ క్లబ్ లోకి చేరుతోంది అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వొప్పుకోబోయే సినిమాలకి కోటి రూపాయలు పైనే తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దీనితో తెలుగు పరిశ్రమలో కోటి రూపాయలు తీసుకుంటున్న చాలామంది నటీమణుల క్లబ్ లో సంయుక్త కూడా చేరిపోయినట్టే అని అంటున్నారు.