తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరవాసులను పొద్దుపొద్దున్నే వరణుడు పలకరించాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసూఫ్‌గూడ, అమీర్‌పేట, మలక్‌పేట, షేక్‌పేట్, మెహదీపట్నం, లక్డీకపూల్, నాచారం, పంజాగుట్ట, హిమాయత్ నగర్, నారాయణగూడ, కోఠి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ఎల్బీనగర్, హయత్‌నగర్, సైదాబాద్, కార్వాన్, షేక్‌పేట్, రాయదుర్గం, కాప్రా, చర్లపల్లి, ఈసీఐఎల్, మల్కాజిగిరి, అమీన్‌పూర్, మారేడుపల్లి, నాచారం, మల్లాపూర్, కీసర, కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, సూరారం, ఉప్పల్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, సుచిత్ర, బోయిన్‌పల్లి, బాలానగర్, బేగంపేట్, వారాసిగూడ, అడ్డగుట్ట, తార్నాకతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుకురుస్తున్నది. తార్నాక, మలక్‌పేట్, లక్టీకపూర్ పెట్రోస్టేషన్, హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచిపోయాయి. పలు కాలనీల్లో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది.
ఈదురు గాలుల వల్ల అధికారులు ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఒక్కసారిగా జోరువాన కురవడంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ యంత్రాంగం సహాయకచర్యలు చేపట్టింది. వచ్చిన వచ్చినట్లే వెళ్లేలా ఏర్పాటుచేశారు.హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. పలుచోట్ల పిడుగులు, వడగండ్లతో వాన పడుతుందని హెచ్చరికలు జారీచేసింది. 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. మేడ్చల్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. దీంతో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు ప్రజలకు సూచించారు.