ఉద్యమ నాయకుడు కేసీఆర్ సారథ్యంలో 22 ఏండ్ల క్రితం పురుడుపోసుకున్న ఉద్యమ పార్టీ, స్వరాష్ట్ర గమ్యాన్ని ముద్దాడి నేటి బంగారు తెలంగాణకు బాటలు వేసిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. అనతికాలంలోనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా నిలిచి, దేశానికే రోల్‌మోడల్ అయ్యిందని చెప్పారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేశవిదేశాల్లోని ‘గులాబీ’ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిదేండ్లలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన సీఎం కేసీఆర్, తెలంగాణ అభివృద్ధి మోడల్‌ను దేశవ్యాప్తం చేసేందుకు బయలుదేరారని చెప్పారు. దేశాభివృద్ధి కోసం తెలపెట్టిన మహాయజ్ఞం జాతీయస్థాయిలో విస్తరించి, మరిన్ని విజయాలు సాధించాలని ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించారు.‘స్వరాష్ట్ర సాధన కోసం నాడు టీఆర్ఎస్.!.. ఉజ్వల భారత్ కోసం నేడు బీఆర్‌ఎస్.
కేసీఆర్ గారి సారథ్యంలో 22 ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న ఉద్యమ పార్టీ, స్వరాష్ట్ర గమ్యాన్ని ముద్దాడి నేటి బంగారు తెలంగాణకు బాటలు వేసింది. అనతి కాలంలోనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా నిలిచి, దేశానికే రోల్ మోడల్ అయ్యింది. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నాంది పలికింది. 9 ఏళ్లలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్, తెలంగాణ అభివృద్ధి మోడల్ ను దేశవ్యాప్తం చేసేందుకు బయలుదేరారు. దేశ అభివృద్ధి కోసం తలపెట్టిన మహాయజ్ఞం జాతీయ స్థాయిలో విస్తరించి, మరిన్ని విజయాలు సాధించాలి. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేశవిదేశాల్లోని ‘గులాబీ’ అభిమానులకు.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు.’ అని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.
స్వరాష్ట్ర సాధన కోసం నాడు టీఆర్ఎస్.!
ఉజ్వల భారత్ కోసం నేడు బీఆర్‌ఎస్.కేసీఆర్ గారి సారథ్యంలో 22ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న ఉద్యమ పార్టీ, స్వరాష్ట్ర గమ్యాన్ని ముద్దాడి నేటి బంగారు తెలంగాణకు బాటలు వేసింది.
అనతి కాలంలోనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా నిలిచి, దేశానికే… pic.twitter.com/JQrvSwX9JA
— Harish Rao Thanneeru (@BRSHarish) April 27, 2023