Home / SLIDER / ఆత్మీయ సమ్మేళనం & ప్లీనరీ ఏర్పాట్లపై మంత్రి జగదీష్ రెడ్డి మార్క్

ఆత్మీయ సమ్మేళనం & ప్లీనరీ ఏర్పాట్లపై మంత్రి జగదీష్ రెడ్డి మార్క్

భారతదేశం గర్వించే రీతిలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబెడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడం జాతి గర్వించదగ్గ అంశమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అంతే గాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సచివాలయానికి అంబెడ్కర్ మహాశయుడి పేరు పెట్టడం దేశ చరిత్రలోనే చరిత్రాత్మకమని ఆయన అభివర్ణించారు. మంగళవారం సూర్యపేటలో ఏర్పాటు చేసిన బి ఆర్ యస్ నియోజకవర్గ ప్లీనరీ సమావేశాలను ఆయన పార్టీ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు.అనంతరం జరిగిన సమావేశంలో ప్రారంభ ఉపన్యాసం చేసిన ఆయన మాట్లాడుతూ వర్తమానానినికి స్ఫూర్తిదాయకంగా నిలిచే రీతిలో 125 అడుగుల బాబాసాహెబ్ అంబెడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యడం తో పాటు సచివాలయానికి అంబెడ్కర్ పేరును పెట్టడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.దళితుల్లో ఆర్థిక అసమానతలు తొలగించేందుకే దలిటీబంధూ పధకాన్ని ప్రారంభించారని ఆయన వెల్లడించారు.గిరిజన తాండలను గ్రామపంచాయతీలుగా రూపొందించడం ద్వారా గిరిజన సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని ఆయన కొనియాడారు. కుటుంబ వ్యవస్థలో ఆర్థికంగా బలపడడం మహిళల చేతుల్లోనే ఉందని గట్టిగ విశ్వసించే వారిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారని ఆయన తెలిపారు.

అందుకే మహిళా పక్షపాతిగా మారి అనేక సంక్షేమ పథకాలకు రూపు నిచ్చారని ఆయన తెలిపారు. మహిళలు ఆర్డిక స్వావలంబనను పెంపొందించే విదంగా వడ్డీ లేని రుణాలు,ఒంటరి మహిళలకు ఫించన్లు,అందించడం తో పాటు వారి ఆరోగ్య పరిరక్షణకు న్యూట్రీషియన్ కిట్ల పంపిణీ,కళ్యాణాలక్ష్మి/షాది ముబారక్,కేసీఆర్ కిట్ ,అమ్మవడి వంటి అద్భుతమైన పధకాలను రూపిందించిన మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన ప్రశంసలు గుప్పించారు. అంతటితో ఆగని ఆయన మహిళల భద్రతకై షి టీమ్స్, మహిళల కష్టాలను రూపు మాపేందుకు మిషన్ భగీరధ వంటి విప్లవాత్మకమైన పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే అమలులోకి వచ్చాయని ఆయన గుర్తుచేశారు. అసలు అభివృద్ధి, సంక్షేమం అంటేనే 2014 కు ముందు 2014 తరువాత లేదా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారానికి ముందు తరువాత అన్న పద్దతిలో చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనాయాన్నారు.కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక జరిగిన వ్యవసాయ విప్లవం యావత్ భారతదేశంలోనే పెను రికార్డులను నమోదు చేసుకుంటుందన్నారు.2014 కు ముందు తెలంగాణా ప్రాంతంలో కేవలం 60 లక్షల ఎకరాలు మాత్రమే సేద్యానికి నోచుకోగా 2020-21నాటికి కోటి 35 లక్షల ఎకరాలు సేద్యానికి వచ్చింది అంటే అది ముమ్మాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనత మాత్రమే నని ఆయన తేల్చిచెప్పారు.

వ్యవసాయంలో 117% విజయాలను నమోదు చేసుకున్న తెలంగాణా రాష్ట్రంలో 2014 కు పూర్వం కేవలం 25 నుండి 30 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు ఉండగా అవి నేడు పంజాబ్ రాష్ట్రాన్ని మించి పోయేలా మూడు కోట్ల టన్నుల ఉత్పత్తికి పెరిగింది అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం కాదా అని ఆయన ప్రశ్నించారు.చరిత్రలో నిలిచి పోయే విదంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి మానవ అద్భుతమైన ప్రాజెక్ట్ ను ఆవిష్కరించిన ఇంజినీర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన అభినందించారు. అన్నింటికీ మించి యావత్ భారతదేశంలోనే వ్యవసాయానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్న ఏకైక రాష్ర్టంగా తెలంగాణా సరికొత్త రికార్డ్ నమోదు చేసుకుందని మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. వ్యవసాయ పెట్టుబడి సాయంగా రైతుబందు,రైతాంగం కుటుంబాలకు భరోసా గా రైతు భీమా పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గొప్ప మైళ్ళు రాళ్లుగా ఆయన పేర్కొన్నారు. గడిచిన ఎనిమిదేళ్లుగా వ్యవసాయానికి వాటి అనుబంధ రంగాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం 45 లక్షల కోట్లు ఖర్చు పెడితే అందులో 1.61 లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు 1.27 లక్షల కోట్లుపంటకొనుగోళ్లకు 59 వేల కోట్లు ఉచిత విద్యుత్ కు 67 వేల కోట్లు రైతుబందు పథకానికి 18 వేల కోట్లు రైతు రుణమాఫీ పథకానికి ఖర్చు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధావ్యుడనిఅని చెప్పుకోవడానికి గర్వ పడుతున్నామన్నారు.పల్లె ప్రగతి-పట్టణ ప్రగతి తో వైకుంఠదామలు,పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు,నర్సరీలు,పక్కారోడ్లతో పాటు ట్రాక్టర్ ,ట్రాలీ నీ ఏర్పాటు చేసుకుని ప్రగతిని పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి గా కేసీఆర్ ఘనతి కెక్కారని ఆయన తెలిపారు. అసంఘటిత రంగానికి సామాజిక భద్రత కలిపించడంలో తనకు ఎవరరూ రారని తనకు తాను నిరూపించుకున్న నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణా యావత్ భారతదేశానికే గర్వకారణంగా నిలిచిందన్నారు.జిల్లాల ఏర్పాటుతో అధికార వికేంద్రీకరణ జరిగి సామాన్యుడికి పాలన అందుబాటులోకీ వచ్చింది అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ చలువ కాక మరెంటని ప్రశ్నించారు. వైద్యకళాశాలలను పెంచడంతో అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో కూడిన వైద్యం సామాన్యుడికి అందుతుంది అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ మహిమ మాత్రమే నన్నారు.మైనారిటీల జీవితాల్లో ముందెన్నడూ లేని ఆత్మస్థైర్యం తెలంగాణా ఏర్పడి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే పెరిగిందన్నారు.ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పర్వదినాన్ని అధికారికంగా జరిపించాడం తో పాటు ఊహించని స్థాయిలో కార్పొరేట్ విద్యను తలదన్నే రీతిలో ఏర్పాటు చేసిన మైనారిటీ గురుకులాలు వారిలో పెరిగిన ఆత్మస్థైర్యనికి కారణమన్నారు.బడుగుల సంక్షేమానికి భరోసా అందించడమే కాకుండా వారిని సుసంపన్నం చేసేందుకు చేపట్టిన పథకాలు అద్భుతమైన ఫలితాలు అందిస్తున్నామన్నారు.జ్యోతిరావు పూలే ఓవర్సీస్ పేరుతో విదేశీ విద్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న చేయూత అభినబడనియమన్నారు.

1000 కి పైగా గురుకులాలను స్థాపించి కార్పొరేట్ ను తలదన్నే రీతిలో విద్యను అందిస్తున్న తెలంగాణా ప్రభుత్వం విద్యారంగంలో అసమాన ఫలితాలు సాదించిందన్నారు.నియోజకవర్గ కేంద్రాలలో నెలకొల్పిన వైద్య కళాశాలలే విద్యా రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన ప్రగతికి నిలువుటద్దం గా నిలబడిందన్నారు.అటువంటి అద్భుతమైన ఫలితాలు సాదిస్తూ అటు ప్రగతిని ఇటు సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్రం ప్రతి బంధకాలు సృష్టిస్తూ అభివృద్ధి కి మోకాలోడ్డు తుందని ఆయన కేంద్రంపై ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిందే తడవుగా మోడీ సర్కార్ తెలంగాణా పై విషం చిమ్ముతుందని ఆయన మండిపడ్డారు. తెలంగాణా కు చెందిన ఆరు మండలాలను ఏక పక్షంగా సీమాంధ్రలో కలుపడమే తెలంగాణా పై కేంద్రం చూపుతున్న వివక్షతకు అద్దం పడుతుందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరధ కు 24 వేల కోట్లు మంజూరు చెయ్యాలంటూ నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్రం తెలంగాణా కు మొండి చెయ్యి చూపిందని ఆయన విమర్శించారు. యావత్ భారతదేశంలో 157 మెడికల్ కళాశాలలు మంజూరు చేసిన బిజెపి సర్కార్ తెలంగాణా కు ఒక్కటీ అంటే ఒక్కటి ఇయ్యలేదని ఆయన ధ్వజమెత్తారు. పైగా మోటర్లకు మీటర్లు పెట్టి రైతాంగాం నుండి ముక్కుపిండి బిల్లులు వసూలు చెయ్యలేదన్న దుగ్దతో రాష్ట్రానికి రావాల్సిన 30 వేల కోట్ల రుణాలకు కోత పెట్టిన ఘనత ప్రధాని మోడీకి దక్కిందని ఆయన మండిపడ్డారు.

ఒక్కటి అంటే ఒక్కటి నవోదయ పాఠశాలలు మంజూరు చెయ్యక పోగా దేశంలో మొత్తం 8 ఐ ఐ యం లు మంజూరు చేసిన కేంద్రం తెలంగాణా కు ఒక్కటి కూడ ఇవ్వకుండా తెలంగాణా పై తనకున్న వివక్షతకు బయట పెట్టుకుందని మంత్రి జగదీష్ రెడ్డి విరుచుకుపడ్డారు. పైగా టి ఆర్ యస్ బి ఆర్ యస్ గా రూపాంతరం చెందడంతో పాటు యావత్ భారతదేశం ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు చూస్తుంటే తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పై మోడీ సర్కార్ ముప్పేట దాడి మొదలు పెట్టిందని ఆయన ఆరోపించారు. యేటా రెండుకోట్ల ఉద్యోగాలు అంటూ నిరుద్యోగ యువత ను మోసం చేసిన బిజెపి కి విద్యార్థి యువత గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంద్రప్రదేశ్ కు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం ఆవశ్యకత ఉందని ఆయన చెప్పారు. పాలనా వైఫల్యం వల్లనే రాయలసీమ నేతలు రాయల తెలంగాణా అంటూ కొత్త పల్లవిని అందుకున్నారని ఆయన పేర్కొన్నారు. టి ఆర్ యస్ బి ఆర్ యస్ గా రూపాంతరం చెందక కర్ణాటక,మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్,ఒరిస్సా రాష్ట్రాల ప్రజలు తమను తెలంగాణా లో కలపాలి లేదూ అంటే అక్కడి పథకాలు ఇక్కడ పెట్టాలి అన్న డిమాండ్ నానాటికి పెరిగిందన్నారు.ప్రస్తుతం అదే పరిస్థితి ఆంద్రప్రదేశ్ లో మొదలైందని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat