దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెనెక్స్ 74.61 పాయింట్ల లాభంతో 60,130.71 పాయింట్ల వద్ద ముగిసింది. మరో వైపు నిఫ్టీ 25.85 పాయింట్ల లాభంతో 17,769.25 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సానుకూల పవనాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడంతో సూచీలు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి.
ఉదయం సెన్సెక్స్ 60,202 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకుంది. కొద్దిసేపటికి మళ్లీ కోలుకొని చివరకు 60,280 పాయింట్ల గరిష్ఠానికి చేరుకొని చివరకు 60,130 పాయింట్ల వద్ద స్థిరపడింది.