దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల వ్యవధిలో 1,89,087 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు.. వీటిలో 6,660 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజా కేసులతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4.49 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో 63,380 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 4,43,11,078 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,369కి ఎగబాకింది.