తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ నియోజకవర్గంలో ఊరూవాడల గులాబీ జెండా పండుగను వేడుకగా జరుపుకున్నారు.
పల్లె, పట్నం అనే తేడా లేకుండా పండుగా వాతావరణంలో బీఆర్ఎస్ జెండా వేడుకను నిర్వచించారు. నిర్మల్ పట్టణంలో పలు వార్డుల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
బుల్లెట్ బండి నడుపుతూ పట్టణమంతా కలియతిరిగారు. అంతకుముందు శాస్త్రి నగర్లోని క్యాంప్ కార్యాలయంలో గులాబీ జెండాను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు.