రంజాన్ (ఈదుల్ ఫితర్) పర్వదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలంగాణలోని ముస్లిం సమాజానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఇస్లాం శాంతి,ప్రేమ,దయ, సౌభ్రాతృత్వాన్ని బోధిస్తున్నదని, మహ్మద్ ప్రవక్త బోధనలు నాడు,నేడు, ఎల్లప్పుడూ ప్రపంచ మానవాళికి అవసరమన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని ధర్మాలను సమదృష్టితో చూస్తున్నారని రవిచంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ముస్లింల భద్రత, సంక్షేమం, ఉన్నతికి కేసీఆర్ అంకితభావంతో ముందుకు సాగుతున్నారని, వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు గాను ప్రత్యేకంగా 206 గురుకులాలను నడిపిస్తున్నారని చెప్పారు.విదేశాలలో ఉన్నత కోర్సులు చదివేందుకు గాను 20లక్షల రూపాయలు,పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు షాధీ ముబారక్ పథకం ద్వారా 1,000,16 రూపాయలు ఉచితంగా అందిస్తున్నారని ఎంపీ వద్దిరాజు వివరించారు.
అలాగే, రంజాన్ సందర్భంగా పేద కుటుంబాలకు దుస్తులు పంపణీ చేస్తున్నారని, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులు ఇస్తున్నారని తెలిపారు.హైదరాబాదులో నిన్ననే డ్రైవర్ ఎంపవర్ మెంట్ ప్రోగ్రాం కింద 78 యువకులకు వాహనాలు అందజేయడం జరిగిందని, రాష్ట్రంలోని 20వేల మంది మహిళలకు త్వరలో కుట్టుమిషన్లు పంపిణీ చేయనున్నట్లు ఎంపీ రవిచంద్ర వెల్లడించారు.రంజాన్ పర్వదినాన్ని ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవలసిందిగా ముస్లిం సమాజాన్ని ఆయన కోరారు.