ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ, ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో శుక్రవారం కలిసింది. ఉపాధి హామీ పథకం మొదలైన నాటి నుండి పనిచేస్తున్న ఉద్యోగులు చాలిచాలని వేతనాలతో పని చేస్తున్నారని వారు మంత్రికి చెప్పారు.
దేశంలోనే మన రాష్ట్రం ఉపాధి హామీ లో నెంబర్ వన్ గా నిలవడం లో ఉపాధి హామీ ఉద్యోగుల పనితనం, ప్రతిభ కూడా కారణమని, వాళ్ల పనికి తగిన విధంగా వేతనాలు అందాలంటే, వాళ్లకు పే స్కేల్ అమలు చేయాలని, ఇందుకు తగిన విధంగా ఆలోచించి, దయామయులైన మంత్రి గారు, మనసున్న మహారాజు సీఎం గారిని ఒప్పించాలని వారు కోరారు.
ఇందుకు మంత్రి స్పందిస్తూ, సీఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి ని కలిసిన వారిలో ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు అంజిరెడ్డి, గురుపాదం, నాగభూషణం, తదితరులు ఉన్నారు.