ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు తర్వాత అనేక మార్పులు జరుగుతున్నాయి. గతంలో ప్రముఖులకు బ్లూటిక్ ఒక తిరుగులేని గుర్తింపుగా ఉండేది. సెలబ్రిటీల పేర్లతో ఎవరెన్ని ఐడీలు క్రియేట్ చేసుకున్నా బ్లూ టిక్ ఉన్నవారినే అధికారికంగా గుర్తించేవాళ్లు.
ఇటీవల ట్విట్టర్‌లో ఈ గుర్తింపు కోసం డబ్బు చెల్లించాల్సి ఉంటుందనే నిబంధన తీసుకొచ్చారు.అయితే తాజాగా ఈ సామాజిక మాధ్యమ వేదికలో ప్రముఖుల బ్లూటిక్స్‌ను తొలగించారు. దీనిపై బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ అసహనం వ్యక్తం చేశారు.
ఆయన స్పందిస్తూ…‘ట్విట్టర్ సోదరుడా.. వింటున్నావా? బ్లూటిక్ కోసం మేము డబ్బులు కూడా చెల్లించాం. మా అక్కౌంట్ బ్లూటిక్ తిరిగి ఇవ్వు. అప్పుడు ఇది నా నిజమైన ఖాతా అని ప్రజలకు తెలుస్తుంది. చేతులు జోడించి విన్నవిస్తున్నా..ఇదీ చాలదా? కాళ్లు పట్టుకోమంటావా?’ అని ట్వీట్ చేశారు.