తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక ఊపు ఊపిన పదో తరగతి పేపర్ల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలించింది.
కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న బండి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. సంజయ్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసేందుకు కూడా నిరాకరించింది.
నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ బండి దాఖలు చేసిన పిటిషన్ విచారణను జూన్ 16కి వాయిదా వేసింది. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసిన కమలాపురం జెడ్పీ హైసూల్ ప్రధానోపాధ్యాయుడు ఎం శివప్రసాద్, ఇతర ప్రతివాదులు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం నోటీసులు జారీ చేసింది.