‘ప్రగతి యాత్ర‘ పేరిట చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు 50వ రోజు పర్యటించారు. అలుపెరగకుండా పాదయాత్ర చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. గడిచిన ఏళ్లలో కోట్ల రూపాయలతో పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలిస్తూ.. ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటూ ఎమ్మెల్యే గారు ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి ‘ప్రగతి యాత్ర‘కు ప్రజల నుండి రోజు రోజుకు విశేష ఆదరణ లభిస్తోంది.
అడుగడుగునా హారతులతో.. పూలతో ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా ఈరోజు జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని భద్రసాయి నగర్, వీరస్వామి నగర్, భిరప్ప నగర్ లలో ప్రజలతో కలిసి ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేశారు. తమ బస్తీల్లో దాదాపు అన్నీ అభివృద్ధి పనులు పూర్తి చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బస్తీల వాసులు యాకయ్య, నాగభూషణం, విష్ణు, మాణిక్యం, సురేష్, జగదీష్, సాయి, విజయ్, అజయ్, శ్రీనివాస్, సమ్మయ్య, రాజా రెడ్డి, కృష్ణారెడ్డి, యాకూబ్, శ్రీను, నాయుడు, సత్యనారాయణ, సంతోష్, శ్రీనివాస్ నాయుడు, దినేష్, వెంకటేష్, కోటేశ్వర రావు, సంతోష్, కృష్ణా రెడ్డి, పాపారావు, ప్రతాప్ రెడ్డి, వెంకటేశ్వర రావు, పెంటయ్య, నార్లకంటి బాలయ్య, నార్లకంటి రమేష్, వార్డు మెంబర్ ఇందిరా రెడ్డి, సీనియర్ నాయకులు సంపత్ మాధవ రెడ్డి, కుంట సిద్ధిరాములు, గుమ్మడి మధు సుధన్ రాజు, కొంటు ముకుందం, యేసు, విజయ్ కృష్ణ, బల్ రామ్, నదీమ్ రాయ్, నాగేష్ రెడ్డి, విజయ్ హరీష్, దుర్గా ప్రసాద్ మరియు మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.