అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కి క్లాస్ మాస్ అని తేడా లేకుండా అందర్ని ఆకట్టుకుంటూ ఇప్పటివరకు రూ.120 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసిన తాజా మూవీ దసరా.. ఈ సినిమాలో నేచూరల్ స్టార్ హీరో నాని ధరణి గా.. మహానటి కీర్తి సురేష్ వెన్నెలగా నటిచింది.
కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి సూరి పాత్రలో నటించగా ప్రముఖ సీనియర్ హీరోలు సముద్రఖని, సాయికుమార్ కీలకపాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో షైన్ టామ్‌చాకో ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. రిలీజై రెండు వారాలు దాటినా ఇంకా జోరు తగ్గడం లేదు.
ఓటీటీ ప్రియులు ఈ సినిమా డిజిటల్లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు సంబంధించిన డేట్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక దసరా సినిమా హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. కాగా ఏప్రిల్ 27 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది.