Home / SLIDER / పేదింటి ఆడబిడ్డల పెండ్లికి భరోసా కళ్యాణ లక్ష్మీ

పేదింటి ఆడబిడ్డల పెండ్లికి భరోసా కళ్యాణ లక్ష్మీ

 తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ మంగళవారం సితాఫలమండీ లోని క్యాంపు కార్యాలయంలో 40 లక్షలకు పైగా విలువ జేసే 20 షాది ముబారక్, 9 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్ళిళ్ళు తల్లి దండ్రులకు భారంగా మారకుండా ఏర్పాట్లు జరిపి, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పధకాలను ప్రవేశ పెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికే దక్కిందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.

నిరుపేద ప్రజల సంక్షేమానికి వివిధ సంక్షేమ పధకాలను అమలు జరుపుతోందని అన్నారు. పేద ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు cmrf ను సద్వినియోగం చేసుకుంటున్నామని పేర్కొన్నారు.

షాది ముబరాక్, కళ్యాణ లక్ష్మి, పెన్షన్ పధకాల లబ్దిదారులు ఎవ్వరికీ చిల్లి గవ్వ కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే తమ కార్యాలయం నెంబరు 040-27504448 కు ఫిర్యాదు చేయవచ్చునని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు. కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునిత, కంది శైలజ, నేతలు కంది నారాయణ, లింగాని శ్రీనివాస్, బీ. ఆర్. ఎస్ యువ నేత తీగుళ్ళ రామేశ్వర్ గౌడ్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat