తెలంగాణలో సత్తుపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణి చేసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు.నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో వారు పలు రకాలు అనారోగ్యానికి గురై కార్పొరేట్ హాస్పిటల్ లలో చికిత్స చేయించుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాల వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యగారి కృషితో నియోజకవర్గ వ్యాప్తంగా 3813 మంది లబ్ధిదారులకు రు 21 కోట్ల 81 లక్ష 88 రూపాయల విలువైన చెక్కులను ఈ నాలుగేళ్ల కాలంలో య లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే సండ్ర అన్నారు.
సత్తుపల్లి లక్ష్మీ ప్రసన్న హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గం స్థాయి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు లబ్దిదారులకు చెక్కులను పంపిణి చేసారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా అంటూ పేద మధ్య తరగతి చెందినవారు వివిధ రకాల అనారోగ్యాల భారిన అది హాస్పిటల్లో వైద్యం చేయించుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి వారికి ఎంత ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
సత్తుపల్లి నియోజకవర్గంలో నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున ఈ పథకం కింద లబ్ధిదారులకు చేయూతనందించడం జరిగిందని ఆయన అన్నారు. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకుఈ పథకాన్ని నియోజకవర్గంలోని 3813 మందికి రూ 21 కోట్ల 81 లక్షల 88 వేల రూపాయలు మంజూరు చేసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే సండ్రన్నారు.