మనసున్న మహారాజు మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరోసారి మానవత్వం చాటుకున్నారు..వివరాల్లోకి వెలితే..ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి దుబ్బాక కి వెళ్తున్నారు.
మార్గమధ్యంలో ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదాన్ని చూసిన ఎంపీ గారు కారు ఆపి, క్షతగాత్రుల వద్దకు వెళ్లారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
వారిలో మనోధైర్యం నింపారు. అనంతరం క్షతగాత్రులను దగ్గరుండి దవాఖానకు పంపించారు. వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.