తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. ఇప్పటికే తొలిదఫాగా 9,231 పోస్టులను నియమిస్తామని ప్రకటించింది.
అందులోభాగంగా డిగ్రీ లెక్చరర్స్ (డీఎల్), జూనియర్ లెక్చరర్స్ (జేఎల్), ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను సోమవారం తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ట్రిబ్) విడుదల చేయనున్నది.
జోనల్, మల్టీ జోనల్ వారీగా ఉన్న పోస్టుల వివరాలతోపాటు నిర్దేశిత విద్యార్హతల వివరాలను, ఎగ్జామ్ సిలబస్ తదితర అంశాలను ప్రకటించనున్నది. ఈ పోస్టుల వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ 12 నుంచి ప్రారంభంకాగా, సోమవారం నుంచి మే 17 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనున్నదని ట్రిబ్ ఇప్పటికే వెల్లడించింది.