Home / SLIDER / భిన్న సంస్కృతులకు నిలయం తెలంగాణ..

భిన్న సంస్కృతులకు నిలయం తెలంగాణ..

ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం లో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం లభిస్తుందని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అన్నారు.బిన్న సంస్కృతులకు నిలయం తెలంగాణ అనీ,ఇక్కడ ఆచారాలు, బిన్న సాంప్రదాయాలకు దేశం లోనే తెలంగాణ ప్రత్యేకం అన్నారు .ఆత్మకూర్ ఎస్ మండలం నశీంపేట లో బొడ్రాయి పండుగ మహోత్సావం లో పాల్గొన్న మంత్రి ప్రత్యెక పూజలు నిర్వహించారు.

అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లోసర్వమత సమ్మేళనాల మరిమళానికి తెలంగాణ రాష్ట్రం నిలువుటద్ధం అన్నారు. ప్రజల బాగోగులు, ఆపదల నుంచి కాపాడేందుకు ప్రతీ పల్లెలో భక్తి శ్రద్ధలతో బొడ్రాయిని ప్రతిష్ఠాంపజేస్తారన్నారు.. దుష్టశక్తు లు, ప్రకృతి ప్రకోపాల నుంచి కాపాడే సర్వదేవతల స్వరూపం బొడ్రాయి అని విశ్వసిస్తారని తెలిపారు.. ఈ క్రమంలోనే నశీం పేట లో బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన చేసుకున్న గ్రామ ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు..

అన్ని కులాలు కలిసి చేసుకునే ఒకేఒక్క పండుగ బొడ్రాయి అన్న మంత్రి మహాలక్ష్మి అంశ గా భావించే బొడ్రాయి తల్లి ఆశీస్సులు గ్రామం లోని ప్రతీ ఒక్కరికీ కలుగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.బొడ్రాయి ప్రతిష్ట కోసం కు గ్రామం లోకి వెళ్లిన మంత్రి నశీంపేట కు వరాలు ప్రకటించారు. గ్రామస్థులు అడిగిన వెంటనే నేరుగా పాఠశాల ను సందర్శించిన మంత్రి అక్కడి అసౌకర్యాలపై , ఇరుకుగా ఉన్న స్కూల్ అవరణ పై అసంతృప్తి వ్యక్తం చేశారు.. వెంటనే స్కూల్ పిల్లలు,యువకుల కోసం క్రీడా మైదానం, లైబ్రరీ, పాఠశాల కోసం స్టోర్ రూం లను మంజూరు చేయించారు. దీంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమం లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోప గానీ వెంకట్ నారాయణ గౌడ్ , ఎంపిపి స్వర్ణలత చంద్రా రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు తూడి నర్సింహ రావ్, సింగిల్ విండో చైర్మన్ కొనతం సత్యనారయణ రెడ్డి, జనయ్యా, సర్పంచ్ రవి, ఉపసర్పంచ్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat