రైతుల మేలు కోసమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని, నాణ్యమైన ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధర పొందాలని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు.
వేంసూరు మండలం, వేంసూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు ప్రారంభించారు. దేశంలోనే ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
దాన్యం కొనుగోలు చేయాల్సిన ఎఫ్సిఐ కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని, కేంద్ర ప్రభుత్వ వివక్షతను చూపుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని అన్నారు.