తెలంగాణ రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నేటి నుండి మే 31 తేదీ వరకు నిర్వహిస్తున్న వార్షిక సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహణపై రూపొందించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరణ లో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడి.రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోనే తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATS) ఆధ్వర్యంలో నేటి నుండి మే 31 వరకు (15. 04. 2023 – 31.05.2023 ) 45 రోజులపాటు నిర్వహించనున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ఏర్పాటు పై రూపొందించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో క్రీడల పట్ల అవగాహన కల్పించేందుకు భవిష్యత్తు క్రీడాకారులను గుర్తించేందుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏడాది సమ్మర్ కోచింగ్ క్యాంప్ లను రాష్ట్రమంతా జంట నగరాల తో పాటు అన్నీ జిల్లాలలో వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది సుమారు 10 వేల మంది విద్యార్థులకు SATS అధ్వర్యంలో సమ్మార్ కోచింగ్ క్యాంప్ ను లక్ష్యంతో ఈ క్యాంపును నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తు క్రీడాకారులను తయారు చేయడానికి ప్రాథమికంగా శిక్షణ కేంద్రాల ద్వారా విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్ది వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడానికి కోచ్ లు ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిభగల క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారు వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ స్థాయి వేదికలపై పతకాలు సాధించి తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తెచ్చేలా సాట్స్ అధికారులు కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ క్రీడల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారన్నారు మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్. అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పతకాలను సాధించిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి నగదు ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు. వారి ప్రోత్సాహకాలను ఘనంగా పెంచామన్నారు. వారికి ఎంతో విలువైన ప్రాంతాల్లో ఇంటి స్థలాలను కేటాహించామన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడలలో పథకాలు సాధించిన రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానం సాధించిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించామన్నారు. వచ్చే క్యాబినెట్ సమావేశంలో స్పోర్ట్స్ పాలసీని సీఎం కేసీఆర్ గారి సహకారంతో ఆమోదించుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశారు మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా తీర్చిదిద్దబోతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నేటి నుండి మే 31 తేదీ వరకు నిర్వహిస్తున్న వార్షిక సమ్మర్ కోచింగ్ క్యాంప్ ను విద్యార్థులు ఉపయోగించుకోవాలని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, తెలంగాణ క్రీడ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సల్తానియా, సాట్స్ ఉన్నతాధికారులు ధనలక్ష్మి, అనురాధ, సుజాత, వెంకటేశ్వరరావు , సుధాకర్, కోచ్ లు పాల్గొ్నారు.బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండుకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం.ప్రాంతీయ భాషల్లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలని అనేకమార్లు కేంద్రానికి బీఆర్ఎస్ డిమాండ్.హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించడం వల్ల ఇతర ప్రాంతీయ భాషల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని గతంలో ప్రధానికి దృష్టికి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.దేశంలోని అన్ని ప్రాంతాల అభ్యర్థులకు సమాన అవకాశాలు ఇచ్చే విధంగా ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసిన సీఎం కేసీఆర్.ప్రాంతీయ భాషల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు నిర్వహించకపోవడంతో దేశవ్యాప్తంగా లక్షలాదిమంది అవకాశాలు కోల్పోతున్నారని బీఆర్ఎస్ పోరాటం.
బీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటంతో దిగొస్తున్న కేంద్ర ప్రభుత్వం.ఇటీవలే వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లోని గ్రూప్- బి, గ్రూప్-సి ఉద్యోగాల కోసం నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్ సీ) పరీక్ష మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.తాజాగా సీఎపిఎఫ్ విభాగంలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షను మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు వెల్లడి.తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి 2024 జనవరి 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటన.