చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన మూవీ ‘బలగం’.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ వేణుపై ఆ సినిమాలోని హీరో ఇంటి అసలు యజమాని రవీంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘డైరెక్టర్ వేణుది మా ఊరే. షూటింగ్ కోసం నా ఇల్లు ఇచ్చాను. డబ్బులిస్తాం అన్నా ఒక్క రూపాయి తీసుకోలేదు. సినిమా సక్సెస్ అయ్యాక వేణు కనీసం థ్యాంక్స్ చెప్పలేదు.
నా నెంబర్ అతని దగ్గర ఉన్నా ఫోన్ చేయలేదు. అయినా ఆయన నుంచి ఏం ఆశించట్లేదు. ఎలాంటి పబ్లిసిటీ కోరుకోవడం లేదు’ అని పేర్కొన్నారు.