‘గ్యాంగ్‌లీడర్’ ‘శ్రీకారం’ వంటి చిత్రాలతో టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు చేరువైంది కన్నడ సోయగం ప్రియాంక అరుళ్ మోహన్. చక్కటి అందం, అభినయంతో యువతరంలో క్రేజ్ సంపాదించుకుంది.
ప్రస్తుతం తమిళ చిత్రాల్లో బిజీగా ఉన్న ఈ అమ్మడు కొంతకాలంగా తెలుగులో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నది. ఈ భామ నిరీక్షణ ఫలించింది. తెలుగులో పవన్‌కల్యాణ్ సరసన నటించే బంపరాఫర్‌ను చేజిక్కించుకుంది.
అసలు వివరాల్లోకి వెళితే.. సుజిత్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ముంబయిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇందులో పవన్‌కల్యాణ్ శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో కథానాయిక కోసం అన్వేషిస్తున్న చిత్రబృందం చివరకు ప్రియాంక అరుళ్ మోహన్‌ను ఖరారు చేసిందని సమాచారం.