తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీలో భాగంగా రెండో విడతలో 3.38 లక్షల గొర్రెల పంపిణీకి పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు గొర్రెలు, మేకలు అభివృద్ధి సంస్థ ఛైర్మన్ బాలరాజు వెల్లడించారు.
జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ట్రాన్స్ పోర్ట్ టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.6,100 కోట్లు కేటాయించిందని తెలిపారు. మొత్తంగా 73.50 లక్షల గొర్రెలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.