తెలంగాణలో గ్రామ పంచాయతీల్లో పని చేస్తోన్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలను క్రమబద్ధీకరణ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది.
ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారిగా వివరాలను ఇవ్వాలని డిపివోలను ఆదేశించింది. కాగా 2019లో ‘రాష్ట్ర వ్యాప్తంగా 9352 మంది జేపీఎస్ నియామకాన్ని చేపట్టిన ప్రభుత్వం వారిని ఇప్పటివరకు రెగ్యులర్ చేయలేదు.
దీంతో ఈ నెల 28లోగా రెగ్యులరైజ్ చేయకపోతే సమ్మెలోకి వెళ్లాలని జేపీఎస్ల సంఘం నిర్ణయించింది. దీంతో వారి సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది.