అఫ్గానిస్తాన్ లో ఇప్పటికే మహిళలకు విద్య, ఉపాధిని దూరం చేసిన తాలిబన్లు తాజాగా మరో కొత్త రూల్ అమలు చేశారు. ఔట్ డోర్ రెస్టారెంట్లలో మహిళలను అనుమతిని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు.
హిజాబ్ ధరించకపోవడం, పురుషులతో మహిళలు కలిసి కూర్చోవడంపై పెద్దలు ఆక్షేపణ తెలిపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాలిబన్లు వెల్లడించారు. ప్రస్తుతం హెరాత్ ప్రాంతంలో మాత్రమే ఈ ఆంక్షలు అమలులో ఉన్నాయి.