తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ నుంచి ఇప్పటికైనా తనను సస్పెండ్ చేయడం సంతోషంగా ఉందని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఇన్నాళ్లకు దొరల గడీ నుంచి విముక్తి లభించిందని పేర్కొన్నారు. గత కొంతకాలంగా పార్టీతో విభేదిస్తున్న పొంగులేటి.. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలతో రాజకీయ వేడిని పెంచుతున్న విషయం తెలిసిందే.