పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు పూర్తయిన వేళ వేణు శ్రీరామ్.. ఫ్యాన్స్కు కిక్కిచ్చే న్యూస్ ను చెప్పారు.
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ప్రస్తుతం 3 స్క్రిప్టులపై పనిచేస్తున్నా. అందులో వకీల్ సాబ్- 2 కూడా ఉంది. ఇది ప్రీక్వెల్ కంటే అద్భుతంగా ఉంటుంది’ అని తెలిపారు.