తల్లాడ మండలం, నారాయణపురం గ్రామంలో నాయిబ్రాహ్మణ నిరుపేద కుటుంబానికి చెందిన బేబీ అద్య 5 సంవత్సరాల నుండి చెవుల వినికిడి సమస్యతో బాధపడుతూ వైద్యానికి ఆదుకోవాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారిని సంప్రదించగా తక్షణమే స్పందించి హాస్పటల్ వైద్యులతో మాట్లాడి వైద్య ఖర్చుల ఎస్టిమేషన్ ను తీసుకొని స్వయంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు హైదరాబాద్ నందు ముఖ్యమంత్రి సహాయనిధి కార్యాలయంకు తీసుకువెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి LOC స్కీమ్ లో వైద్యానికి పూర్తి మొత్తంగా 7 లక్షల మంజూరు చేయించి స్వయంగా వారి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు చిన్నారికి మంజూరు పత్రాన్ని అందజేసి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా సిఎం సహాయ నిధి పేద ప్రజలకు వరం లాటిందని అన్నారు. ప్రత్యేక చొరవతో 7 లక్షల రూపాయలు ఎల్ఓసిని మంజూరు చేయించిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారికి చిన్నారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.