శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కివీస్ బ్యాటర్లు ఆది నుంచే దూకుడుగా ఆడారు.
ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. టిమ్ సీఫెర్ట్ 48 బంతుల్లో 88 రన్స్ చేశాడు.. మరోవైపు లాథమ్ 31, చాడ్ బోవ్స్ 17, చాప్టాన్ 16, డారిల్ మిచెల్ 15 రన్స్ చేశారు. తాజా విజయంతో కివీస్ 2-1 తేడాతో సిరీస్ ను కైవశం చేసుకుంది.