ఏపీలో అధికార వైసీపీకి చెందిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి,ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫాం హౌస్ అక్రమ నిర్మాణమంటూ మాజీ మంత్రి నారా లోకేష్ గూగుల్ మ్యాప్ ను విడుదల చేశారు. లోకేష్ మ్యాప్ ఫేక్ అంటూ సోషల్ మీడియాలో ఎమ్మెల్యే కేతిరెడ్డి లేఖను పోస్ట్ చేశారు.
ఇదే అసలైనదంటూ అంటూ మరో మ్యాప్ ను విడుదల చేశారు. సర్వే నంబర్ 43లోని భూమిని తన భూమిగా చూపించారని, వాస్తవంగా తనకు 25.38 ఎకరాలు మాత్రమే ఉందని చెప్పారు.